Monday, May 20, 2024

డబ్బు చెదలు తేది : 24-04-2023 శీర్షిక : బుద్ది చెదలు బూజు దులపాలి

 డబ్బు చెదలు

తేది : 24-04-2023
శీర్షిక : బుద్ది చెదలు బూజు దులపాలి 
సంఖ్య : సహస్రాధికం  

మనుషులయినా  ... మనీ అయినా ... 
చలామణిలో ఉంటేనే శోభాయమానం .... 
చలనములోనే జగతి   చైతన్యశీలం .... 
నలుగురిలో చర్విత చరణం అయ్యేది .... 

ఇచ్చి పుచ్చుకోవడాల ఇలవర్షతో 
నడకలు నేర్చి ....మనిషి ఇగురంగా 
రంగుకాగితాలతో రాగాలు పలికించి 
విలువల వలువలు తొడిగాడు ..... 

ఇంతింతై వటుడింతై లాగా .... 
ఇల్లంతా ... విశ్వమంతా ఆక్రమించి 
మనిషి బుద్దిని ఏలే స్థాయికొచ్చి 
మందబుద్ధిని చేసి ఆడిస్తున్నది ... 

ఆత్మీయతల చట్రంలోకి 
అడుగులేసి ... మల్లె పరిమళాలను 
విచ్చిన్నం చేసి .... గ్రీష్మ తాపాలను 
వెదజల్లుతూ వింతలు చూస్తున్నది..... 

అలా అని అక్కసుతో మూలన పెట్టామా...    
అంతే సంగతి ... మూల్గుతుందో 
ముక్కుతుందో ... మాడి మసై పోతుందో .....
మనకెందుకు కొరగానిధై పోతుందో ..... 

మూలకు ఉంటే నిల్వలు పెరిగిపోయి 
చలామణిలోకొస్తే  విరిగేది కాదు ..... 
పరులపై ఈర్ష్య అసూయలతో 
పైకాన్ని దాచి  అటకెక్కించినా .... 
స్వార్థానికి ఉపయోగపడని సరంగే  రేపది  .... 

సద్ది మెతుకుల బువ్వ దొరకాలంటే 
బుద్ది చెదలుకు బూజు దులపాలి .... 
సవ్యమైన ఆట మనం  నేర్చుకుని 
సమతుల్యతల సరాగాల పాట పాడాలి .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment