Monday, May 20, 2024

కలుపుగోలు తనం తేది: 03-05-2023 శీర్షిక : ఆత్మ సౌందర్యం ....

 కలుపుగోలు తనం 

తేది: 03-05-2023
శీర్షిక : ఆత్మ సౌందర్యం .... 

పల్లెపట్టున పిలుపుబంధంలా 
తోడు పెరుగై తోవ చూపించినట్టు... 
ఆత్మీయతల అడ్రసడిగితే  
ఉప్పు ఆవలా మెప్పు పొందినట్టు... 

కపటము కానరాని కాంతి దీవిలా 
నిర్మల తేజమైన నీరజ నేత్రమై 
హంసల దీవంటి హృదయతటాకంతో  
చేయందించే చిరునవ్వుల మందహాసం... 

రైలుపయనమంటి జీవనయానంలో 
పరిచయంలేని ప్రయాణీకుల బలగంతో  
పలకరింపులు... విరులై పరిమళించినట్టు
 అవసరంలో అందిపుచ్చుకోవడమే .... 

మానవతలకు మచ్చుతునకగా 
ఆత్మీయతలకు ఆనవాలుగా 
నడవడికలకు నవ చిరునామాగా 
పలకరించే కలుపుగోలు తనం .... 

పై పై మెరుగుల పటాటోపమైతే 
మేడిపండును తలపించునేమో ... కానీ 
అసలు సిసలైనది అల్లుకోవడమనేది 
ఆత్మసౌందర్యంతోననే గ్రహించాలి ....

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment