Monday, May 20, 2024

పుండు మీద కారం తేది: 20-04-2023 శీర్షిక : ఓ వింత రోగం ...

 పుండు మీద కారం 

తేది: 20-04-2023
శీర్షిక : ఓ వింత రోగం ..... 

నడకలెన్ని నేర్చినా ... నటనలెన్ని 
చూపినా .... పరుగులెన్ని పెట్టినా ...
గమ్యమెప్పుడు చేరినా... ప్రశాంత 
జీవితమే ప్రతివారు కోరుకునేది .... 

కొంతమందికది  సహజలక్షణం... 
మానవత్వాలు మరిచి దానవత్వాలకు 
వారసులై మసలు కోవడం .....  
మనుషులకయినా ... దేశాలకైనా 
మరకలాంటిదే రాక్షస గుణం .... 
మనువున్నన్ని రోజులు మారనితనం .... 

పొరుగులు అబాసులౌతుంటే....  
కొరివితో కదిలించి....కోరుకోవడం 
మంచితనమనిపించే  మాటలు  .... 
మనసులో మంట పెట్టి నోటితో 
పాపమనడం ఓ వింత రోగం .... 

ఓదార్పుల  నటనలతో  చురకత్తులు  
దించడాలు ... వెన్నతో పెట్టిన విద్య ... 
సర్కాస్టిక్ గా  స్పందిస్తూ కోతి పుండును 
రాచ పుండు చేయగలగడం ....... 

పాత పద్దుల పరిష్కారాలకో .... 
ఆధిపత్యాలకై అర్రులు చాచే 
అంగడి బేరాలకో .... అష్టావక్ర 
దోష గుణ బహిర్గతాలో ...అవ లక్షణం ... 

జీవరాశిలో మిన్నంటూ విర్రవీగే 
మనిషి మారాలి ... సహజ మానవత్వానికి 
నిలువెత్తు నిదర్శనమై సమాజంలో 
విరిజల్లుల  పరిమళాలు వెదజల్లాలి .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment