Monday, May 20, 2024

ఆట విడుపు తేది : 19-04-2023 శీర్షిక : శక్తి పరిమళాలు

 ఆట విడుపు 

తేది : 19-04-2023
శీర్షిక :  శక్తి పరిమళాలు 
కవిత సంఖ్య : సహస్రాధికం .... 

పని ఏదైనా సరే పంతాలకు పోకుండా 
వంతులవారీగా సంతులనం పాటిస్తూ 
సంయమనాల సమన్వయపు  తోటలో 
శక్తి పరిమళాలను వంపుకోవడమే ..... 

మంచి చెడుల మతలబు లేకుండా 
గానుగెద్దుల గమ్మత్తుల అడుగులు .... 
మూస విధానాల నుండి ముక్తి పొంది 
మానసిక శారీరక విశ్రాంతుల ఆశ్రయాలు ... 

విరామమెరుగని వింతలు నిండిన 
విలువలు లేని చదువుల నీడను 
విడనాడి ...వేసవి సెలవులకు  
వేంచేసే అమ్మమ్మల ఇల్లులు  ...... 

ఆరుగాలం అరకదున్నే రైతన్నలకు 
ఎదుగు బొదుగూ లేని ఎవుసంలో 
అప్పుడప్పుడు ఆచరించి  పదిలమయే 
ప్రశస్తాల ప్రాముఖ్యపు పంట మార్పిడిలా .... 

అస్తమానం విస్తుపోయే విధంగా 
విధి నిర్వాహణల వింత ప్రవర్తనలే .... 
అంచు మీద నిలబడి శత్రువుల 
మెడలు వంచే సైనికులకు నిర్వహించే 
మాక్ డ్రిల్ అవగాహనల  ఆలోచనలు  ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment