ఓటమి పాఠాలు -2
తేది : 05-01-2022
శీర్షిక : విజయనానికి ఊతం ...
కవిత సంఖ్య : సహస్రాధికం
అవును ! విజయం విర్రవీగితే
అపజయం హాస్యం పాలవుతుంది ...
నవ్విన నాప చేను పండకపోదు
నడకలు మార్చుకుంటే సరిపోతుంది ...
ప్రయత్నించిన ప్రతీసారి గెలుపు
కరచాలనం చేయకపోవచ్చు....
ఓటమి పలకరించిందని
దిగాలు పడితే దగా మిగులుతుంది ....
దూరం పెరుగుతుంది ....
ఒళ్ళు విదిల్చుకుని ఓపికలు
ఆవహించుకుంటే ....ప్రణాళికలను
పనివిధానాలను మార్పులు చేర్పులతో
అక్కున చేర్చుకుంటే.... విజయ
బంధుత్వానికి వీర తిలకం దిద్దవచ్చు ....
బలా బలాల బేరీజులతో…
పట్టుదల పెట్టుబడులను తోడ్పాటు చేసుకుంటే ....
అకుంఠిత దీక్షలు అండ దండలైపోతే
విజ్ఞానాలకు మరింత పదను పెట్టుకునే
వినమ్రతలు ఒంటబడుతాయి……
వాస్తవ పరిస్థితులకనుకూలంగా మనల్ని
మనం తీర్చి దిద్దుకునే వెసులుబాటు…
బలహీనతలను గుర్తించుకునే
బంగారమైన అవకాశం మనముందే…
ఓటమెప్పుడూ శాశ్వతం కాదు .....
గిర్ గిర్ కర్ చల్నా సీఖో
అన్న గొప్ప కవి పుంగవుని
మాటల్లో దాగిన సత్యమే ....
విజయానికి ఊతమే అది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment