Monday, May 20, 2024

హనుమంతుడు తేది : 06-04-2023 శీర్షిక : శ్రీరామ భక్తుడు ...

 హనుమంతుడు 

తేది :  06-04-2023
శీర్షిక : శ్రీరామ భక్తుడు ... 

భారతాన భవ్యమైన భగవంతుడు 
ఊరూరా కొలువబడే ఉద్దండుడు 
అంజనీ పుత్రుడు  అతిబలవంతుడు 
కేసరి తనయుడు  శ్రీరామ భక్తుడు .... 

సూర్యుడిని ఫలమనుకుని సునామీలా 
దూసుకెళ్లి ... వరములెన్నో 
పొంది చిరంజీవి అయినాడు .... 

సుగ్రీవుని స్నేహమంది సూదంటుగా 
కలిసినాడు ... ఇనవంశపు రాజును 
ఇగురముతో చేరినాడు  బంటుగాను ..... 

సహజమైన మరుపును సహవాసులు 
గుర్తుచేయగా ....సంద్రమును దాటి తాను 
సీతమ్మ జాడ దెచ్చె ... రామయ్యకు 
మోదమిచ్చె ..... 

సైన్యమంతా కూడగట్టి సేతువును 
బంధించి ....  సింహళం బైలెల్లె .... 
సింగములై పోరుకు... 

సౌమిత్రి మూర్ఛిల్లగ  సంజీవిని  
పట్టి తెచ్చి ... సోదరుల ప్రేమలను 
సాదరంగా పొందినాడు .... 

సీతా రాముల పట్టాభిషేకములో 
పట్టరాని సంతోషమే పక్కన తన 
చోటుతో ... 

నగునూరి రాజన్న

No comments:

Post a Comment