ఓటమి పాఠాలు
తేది : 05-01-2022
శీర్షిక : విజయనానికి ఊతం ...
కవిత సంఖ్య : సహస్రాధికం
అవును ! గెలుపంటే ఓ ఊపు.
గెలుపంటే వెయ్యేనుగల బలం...
గెలుపుకు... గెలుపు మాటకు ఎప్పుడైనా
ఎక్కడైనా తిరుగులేని పట్టం….
ప్రయత్నించిన ప్రతీసారి గెలుపు
కరచాలనం చేయక పోవచ్చు….
కారణమేంటో కనిపెట్టలేనప్పుడు
కాలాడదు ....అడుగు కదలదు ...కానీ ..
ఒక్కసారి ఒళ్ళు విదిల్చుకుని
లోపాలను సమీక్షించుకోగలిగితే….
ఓటమి పలకరించినపుడే…
ఓపికలను ఆవహించుకుంటే…
ప్రణాళికలలో , పని విధానాలలో
విశ్లేషణల సహేతుకతల నిర్దారణలు ....
బలా బలాల బేరీజులతో…
పట్టుదల పెట్టుబడుల తోడ్పాటు చేసుకుని....
అకుంఠిత దీక్షలు అండ దండలైపోతే
విజ్ఞానాలకు మరింత పదను పెట్టుకునే
వినమ్రతలు ఒంటబడుతాయి……
వాస్తవ పరిస్థితులకనుకూలంగా మనల్ని
మనం తీర్చి దిద్దుకునే వెసులుబాటు…
బలహీనతలను గుర్తించుకునే
బంగారమైన అవకాశం మనముందే…
ఓటమెప్పుడూ శాశ్వతం కాదు .....
గిర్ గిర్ కర్ చల్నా సీఖో
అన్న గొప్ప కవి పుంగవుని
మాటల్లో దాగిన సత్యమే ....
విజయానికి ఊతమే అది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment