చిత్రకవిత.
తేది. 19-05-23
శీర్షిక: ప్రకృతి కాంత
తెలుపు నలుపుల చిత్రమే
తేరిపారగ చూస్తేనే కద…
మేని మెరుపుల తళుకులన్నీ
మిరుమిట్లుగొలిపే కాంతులమయం…
సెలయేటి గలగలలే స్వరమున
వాగువంకల హోయలే నడుమున
పిల్లగాలి తెమ్మరలే కేశములకు
పలకరింపై… ద్విగుణీకృతమాయె…
నీలాల నింగి లోని చంద్రబింబము
నిజరూపం చూపించె దర్పణమై…
ముద్దబంతి అందాలు ముంగురులై
పలకరించి పరవశించె మానసం …
చెలి కన్నులలో చెంగల్వమే
కొప్పున తురిమిన మరుమల్లెలతో…
చూపు తిప్పుకోనీయని తిప్పలే
వాలుకంటి కన్నియ ఆలోచనలు…
పల్లె ప్రకృతి కాంత పరవశమే
పచ్చని పొలాల మధ్యన విచ్చుకున్న
పండువెన్నెల సోయగంలో …
చల్లని వెండి తీగల కాంతిలో ....
No comments:
Post a Comment