కవన రవళి -
హైకూలు
తేది : 18-05-2023
1. మానవాళికి
నడకలు నేర్పింది
నాగరికత ....
2. జీవరాశిలో
మిన్నగా చేసినది
విచక్షణలే
3. ఆత్మీయతలు
అనురాగాల పూలే
మనిషి తోట ....
4. వడివడిగా
అడుగులు వేసింది
పారిశ్రామికం....
5. విడగొట్టింది
తమాషాలు చూస్తుంది
సాంకేతికత
6. తెరలవాణి
తెంపరి చర్నాకోల
బంధాలలోన
7. ప్రజలంతయు
పటిష్టము కానిదే
ప్రజాస్వామ్యము ....
8. ప్రజలెప్పుడు
ఒకటి కాలేరని
నాయక ధీమా
9. ఎన్నికలైనా
తేలని లెక్కలెన్నో
కర్ణాటకము ....
10. స్వార్థం వీడితే
సంధించుకోగలము
సర్వసత్తాకం
నగునూరి రాజన్న
No comments:
Post a Comment