Monday, May 20, 2024

ఆవకాయ తేది: 18-03-2023 శీర్షిక : ఆంధ్రుల ఆరవ ప్రాణం ....

 ఆవకాయ 

తేది: 18-03-2023
శీర్షిక : ఆంధ్రుల ఆరవ ప్రాణం .... 

గుర్తుకొస్తున్నాయి  నాటి బాల్యపు బహు 
అమూల్యమైన బంగారు క్షణాలు ..... 
బంతి భోజనాలలో తప్పక వడ్డించే 
ఆవకాయ.... వరసైనోళ్ల వ్యాఖ్యానాలు ..... 

ఆవకాయంటే  ఆంధ్రులకు 
ఆరవ ప్రాణం ... అదిలేకుంటే  
అన్నీ సుద్దులే .. ముద్ద దిగదు ... 
ఏ ఉత్సవాల ఊసులు పరిపూర్ణం కావు .... 

వారం వర్జ్యం ముహూర్తం 
వరసబెట్టి చూసేటోళ్లు ఆ రోజుల్లో ... 
నలుగురిని పిలిచి నందనంలా 
తలో చేయి వేసి తన్మయత్వం పొందేవారు .... 

పెళ్లి పేరంటాలు  బారసాల భరోసాలు ... 
ఇలా రాబోవు సందర్భాలను రమ్యంగా 
గుర్తించి....పరిమాణాలను పకడ్బందీగా 
నిర్దారించేవారు ....ఏడాదికొక్కసారి కాబట్టి ....  

ఉన్నవారి విందు వినోదాలకే కాదు ... 
పేదసాదలకు కూడా పెద్దదిక్కయ్యేది .... 
అడిగినవారికి కాదు లేదనకుండా 
కలిగినది అందరికి పంచేవారు ...ఆరోజుల్లో ... 

పేద ధనికుల భేదమెరుగదు .... 
కాయకష్టం చేసుకునేటోళ్లకు 
కళ్ళళ్ళ నీల్లుబుకినా .... కడుపుకింత 
తినగలిగేవాళ్ళు .... గంజి నీళ్లతో 
గమ్మత్తుగా .... చల్లన్నంతో నంజుకుని .... 

చెక్కు పిక్కలు తీసేసి చందమామ ముక్కలతో .... 
చెక్కు పిక్కలతో కలిపి చక్కంగ నాలుగు వక్కలుగా కోసి.... 
రకరకాల పచ్చళ్ళతో  రందిలేని జీవితం .... 
స్వగృహ లొచ్చాక సంస్కృతి అంతా అటకెక్కింది .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment