Monday, May 20, 2024

ఆకాశమే హద్దుగా తేది: 17-04-2023 శీర్షిక : దీక్షా దక్షతలు ....

 ఆకాశమే హద్దుగా 

తేది: 17-04-2023
శీర్షిక : దీక్షా దక్షతలు .... 

అనుభవ వనాల  తోటలలో 
అందుకున్న ప్రతిఫలాల బేరీజులతో ....  
యోగ్యతల వడబోతల తోరణంలో 
అలవాటుగా సలహాలందించే పరిధి ..... 

విద్యార్జనలో గాని విజ్ఞానార్జలో గాని 
ఎంతటి కష్టాన్నయినా  ఇష్టంగా 
మలుచుకుంటే .... అష్టసంపదలే... 
ఎదురులేని ఎదుగుదలలే ..... 

అవకాశాలు అందరికి అదుబాటైనా 
అందులో  అందిపుచ్చుకునేది కొందరే .... 
ఆ కొందరు మణిరత్నాలై మెరిసినప్పుడు 
ఆకాశం నీ హద్దంటూ  పొగడ్తల దండలు .... 

విషయమేదైనా  విస్తరించుకోవచ్చు .... 
పరిమితులు దాటి పరిణతిని చేరుకుంటూ .... 
అనితర సాధనల అకుంఠిత దీక్షా దక్షతలతో  
అంబరపు  అంచులే సరి హద్దులుగా .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment