కాగితం మీది జీవితం
తేది : 17-05-2023
శీర్షిక : ఉపయోక్తను బట్టి ....
సంఖ్య : సహస్రాధికం
రెండు వైపులా పదునైన కత్తి
అవసరానికే వినియోగించాలి
ఆశలు ఆశయాలకు గమనమై
కుంభ స్థలమైన గమ్యం చేరుకోవాలి
ఒడుపుగా ఒరలో సర్దుకోవాలి ....
కాదంటే మొదటికే మోసం .....
లేదంటే ఉపయోక్తకే హాని .....
అనుభవాల దొంతరలలో
అంకురమైన అందమైన
ఆలోచనలన్నీ వస్తువులుగా మార్చి
నగిషీలు చెక్కి నాణ్యతలు జోడించి
అందమైన పేటికలుగా అమర్చి
భద్రపరిస్తే తీయని జ్ఞాపకాలే .....
అవే తీయని జ్ఞాపకాలలోని
ఆత్మను వదిలేసి
ఆత్మీయతలను అల్లుకోకుండా....
అనురాగాలను స్పృశించకుండా ....
మధురిమలను గ్రోలకుండా ...
పరిమళాలను పట్టుకోకుండా ...
మూలసూత్రాలను ముట్టుకోకుండా ...
జీవితాన అమలు చేసుకోకుండా.....
మూల పడేసి మురుగ బెట్టినా....
మ్యూజియంలో మురిపమై
కాగితాల మీది జీవితమై మిగిలిపోతుంది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment