Monday, May 20, 2024

కవన రవళి- అంశం : పాదాల పరవశం -17-05-2023

 కవన రవళి సాహిత్య వేదిక 

అంశం : పాదాల పరవశం 

1. అడిగితి కోరికలని అలిగితివా శివా 
కడువిధముల ప్రార్థించెద కరుణించవా 
ఇడుములు బాపే ఉపాయమే నమః శివా 
అడిగినంత ఇచ్చినంత పరవశమే పరమశివా !

2. కుడుములరేడును మొక్కితిని శివా 
నుడువుము అభయపు వచనములను శివా 
బిడియములింక బాపి రక్షించుమయా శివా  
అడిగినంత ఇచ్చినంత పరవశమే పరమశివా ! 

3. కుడి ఎడమల తేడాలెందుకు గౌరీనాథా 
వడివడిగా  మము  బ్రోవగా తరలిరావా .... 
గుడిలో నిలిపి పూజాలెన్నో చేయుదునయ్యా 
అడిగినంత ఇచ్చినంత పరవశమే పరమశివా !   

4.గుడిలోపల శంఖమునై నిలువునా 
మడి ఆచారముల పూజలన్ని చేయనా 
అడగనా అనాయాస మరణము వరముగా 
అడిగినంత ఇచ్చినంత పరవశమే పరమశివా !    

5. వడివడిగా వరములిచ్చే పరమశివా  
అడిగినదే తడవుగా అసురునకిస్తివి కదయా 
బిడియమేల భస్మాసురుని ఎదుటపడా 
అడిగినంత ఇచ్చినంత పరవశమే పరమశివా !    

6. గడ గడ గరళమును గ్రోలిన  శివా   
చూడ ప్రళయ నిరోధమునకై కాచిన శివా 
వేడ  నీవే శరణంటి మనమున దిక్కెవరికా 
అడిగినంత ఇచ్చినంత పరవశమే పరమశివా !    

7.  కడివెడు జలములతో అభిషేకించి 
పిడికెడు భస్మంతో అలంకరించి 
మూడు మూరల మల్లెలతో అలంకరించితి 
అడిగినంత ఇచ్చినంత పరవశమే పరమశివా !    

8. అడిగినదే తడవుగా వరములెన్నో ఇస్తివి 
దౌడు తీయ జంకలేదు శంకలేకుంటివి 
నుడువ పరంధాముడు అభయ వచనము 
అడిగినంత ఇచ్చినంత పరవశమే పరమశివా !    

9. మూడు కన్నులవాడ చూడవయా 
మూడు జగములు నీకై తపియించగా 
వాడని వరములనిచ్చి రక్షించవయా 
అడిగినంత ఇచ్చినంత పరవశమే పరమశివా !    

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment