Monday, May 20, 2024

మండుతున్న ఎండలు తేది : 16-05-23 శీర్షిక : ఆరోగ్య సూత్రం

 మండుతున్న ఎండలు 

తేది : 16-05-23
శీర్షిక : ఆరోగ్య  సూత్రం 

చీకటిని దాటి వెలుగులు 
నేటిని దాటిన రేపటి రోజు 
భ్రమణ పరిభ్రమణాలు 
పక్కాగా జరిగే జాతరలు ..... 

ప్రకృతిలో మార్పుకు శ్రీకారాలు 
ప్రగతికి అవే ఓంకారాలు .... 
బాల భానుని బంగారు కిరణాలతో 
బయలు దేరిన చలికాలం .... 

నవ యవ్వనుడై తేజోమయుడై 
నడి  నెత్తిమీద మొట్టికాయలేసి 
భయపెడుతూ ... బతుకు తోవ 
బోధిస్తాడు ... భద్రంగా ఉండమని 
సూచిస్తాడు .... 

ముదుసలిగా మారి ...మురిపాల 
తొలకరితో పలకరించి పాడి 
పంటలకు పచ్చ జండా ఊపి 
జీవరాశికి మనుగడైతాడు .... 

నౌతప్పా అని ఉత్తర భారతంలో 
అన్నా ...  కృత్తికలో కుతికలు 
ఎండిపోతాయన్నా ... రోహిణిలో 
రోకండ్లు పాలిగిపోతాని దక్షిణ 
భారతంలో అన్నా  ... 
సూచనలన్నీ ఆరోగ్య సూత్రాలే .... 

శుచి శుభ్రతలైనా ... కాలమాన 
పరిస్థితుల అంచనాలైనా ... 
కావలిసినదల్లా మానవాళి సంక్షేమం 
జీవరాశి సుసంపన్నం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment