తప్పిపోయిన జీవనసరళి
తేది :10-05-2023
శీర్షిక : ఎక్కడని వెదికేది ?
సంఖ్య: సహస్రాధికం.
ఎక్కడని వెదికేది ? ఎవరినని అడిగేది ?
మానవతా సొబగుల సౌగంధికా పుష్ప
పరిమళాల జాడలు...
మనిషికే సొంతమయిన ఆత్మీయ
లతల ఉపశమనాలు ....
వందలేండ్ల నుండి ప్రకృతి నేర్పిన
పాఠ్యపు సారాంశ పదనిసలు ....
మనిషి నిలువెల్లా స్వార్థంలో మునిగి
సరిగంగ స్నానాలు చేస్తుంటే ...
కుంటుపడిపోయిన కుటుంబ బంధాలు ...
మరిచిపోయిన మానవ సంబంధాలు ....
మానవాళికి మచ్చలు మిగుల్చుతుంటే.....
పచ్చని పల్లె తల్లిని విడిచిపెట్టి
పారిశ్రామికతల పరుగులలో కలిసి
పట్నం బతుకులకై పారాడినపుడే
అడుగులు తడబడి అలసటల
ఊపిరి ఉక్కిరి బిక్కిరయ్యింది .....
ఉపాయంగా వచ్చిన జపాన్
ఎరువులతో పంటదిగుబడి ఆశలు
అత్యాశలై పేరాశలై... సాటి
మనుషులపై ప్రేమలు సన్నగిల్లి
మమతల పందిరి విరుగు చూపింది ...
వ్యాపార నీతులు వంతలు మారి
కట్టడి లేని కల్తీలతో చేతులు కలపగానే
కాలుష్యాలు కాలరెగరేసుకుని
విషనాగులై వీర విహారం చేస్తూ ....
ఆత్మీయతల మానవత్వపు గోడలు
బీటలు వారుతున్నాయి ....
వృత్తిధర్మాలు బొత్తిగా మరిచిపోయిన
చాలామంది చేతుల్లో మానవాళి
ఆయుష్షులు.... దినదినం మైనం
ముద్దలా కరిగి పోతున్నాయి ....
ఫలహారాలయిపోతున్న పాలనలతో ....
పంచుకునుడే కానీ పాలించుడు
మరిచిపోయిన కొంతమంది వల్ల
ఎండమావులైన ప్రజాసంక్షేమం
కొండెక్కి నిరీక్షిస్తున్నది.
సాంకేతికత సొబగులు అద్దుకున్నా క
సాటి మనిషిని చూస్తేనే ఝల్లుమంటున్నది
సందట్లో సడేమియాలాగా... సడీ సప్పుడు
లేకుండా కష్టార్జితాలను కాలరాసి
లాగేసుకుంటున్న హ్యాకర్లతో ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment