Monday, May 20, 2024

శిక్షణ తేది : 13-05-2023 శీర్షిక : అదనపు శిక్షణ

 శిక్షణ 

తేది : 13-05-2023
శీర్షిక : అదనపు శిక్షణ 

ప్రకృతి మాత ఒడిలో 
పారాడే కాల గమనాలన్నీ 
శిక్షణ గల సిపాయిలే ..... 
శీత ఊష్ణ వర్షపు కాలాలుగా ..... 

అంతుబట్టని క్రమశిక్షణలే 
అవనిమాత భ్రమణములు  
ఆదిత్యుని చుట్టూ పరిభ్రమణం 
గ్రహా కూటమి  గమనం .... 

తారలకెవరు తర్ఫీదులిచ్చె 
తణుకులీని వెలగాలని…
శశికెలా  నిశితమాయె  
శుక్లములో వృద్దిచెంది 
కృష్ణపక్షంలో క్షీణించ…

పక్షులకెవరు నేర్పిరి 
పంక్తిలోన పయనించాలని …
చీమకెవరు బోధించిరి 
వరుసలోన నడక సాగించాలని .... 

అనంత విశ్వములో 
అందరికి అవసరమయ్యే
అసలు సిసలు శిక్షణలు 
స్వయంచలనమే…. కాని… 

జీవరాశిలో మిన్నయ్యే 
మనిషికి మాత్రమే సాధ్యం ... 
అదనపు శిక్షణలద్దుకుని 
విజ్ఞానాల వినువీధులలో 
విహరించగలిగే సామర్థ్యం .... 
ప్రకృతి మీద పట్టు సంపాదించాలనే
తాపత్రయం…. 

పదే పదే పరితపిస్తూ 
పలు శిక్షణలను తీసుకుంటూ 
ప్రయత్నిస్తూనే ఉన్నాడు…
ప్రథముడిగా నిలిచేందికు….. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment