చిత్ర కవిత
తేది : 16-04-23
శీర్షిక : నుయ్యి ... గొయ్యి ...
సప్తవర్ణాలు సంతరించుకుని
సందడి చేస్తున్న శింగిడి వనం ....
నోరూరిస్తూ కుప్పలు తెప్పలుగా
సంతలు నిండిన పండ్లు పాలు
ఆకు కూరలు ... కూరగాయలు ....
పంచడమే తెలిసిన ప్రకృతికి
పంటలు ఇవ్వడమే తెలుసు ....
మానవాళి చేతులో నలిగి పోతూ
కపటత్వాలకు కలుషితములై ...
భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతున్నది .....
మంచి ఆలోచనలే ... మాగిపోతున్నవి
బహుమంచి నినాదములే...పలుకుబడి లేవు
మధ్యలో .... మాయమౌతున్న దొంతరలు ....
లబ్దిదారులకు అందే లోపల
లాగేసుకునే గుంటనక్కలు తోడేళ్ళు ....
జనుల ఖాతాలలో చేరుతున్న ఖర్చులు
జమాబందీ పెద్ద పెద్దోళ్ల జేబులకు ....
ఇవన్నీ కాకుండా ....ఇకమతుగ
మడతపెడుతున్న దళారీలు .....
చెట్టు ముందా ... విత్తు ముందా అన్నట్టు
కల్తీల లీలలో ... కాలుష్యాల మహిమలో
రసాయనాల పంటలే కాదు ....రసాయనాల
ముంచి తాజా లుక్కు లు... విచారిస్తే వింతరోగాలు ....
సంశయాల సంచులే వైద్యుల సలహాలకు
వాటమైన పౌష్టికాహారమంటూ….
ముందుకేల్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యిలా
తింటే మంచిదా... తినకుంటే మంచిదాని…
అనుమానం అంతకంతకు పెనుభూతమై
ఆక్రమించుకున్నది అందరి మనస్సులో .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment