Monday, May 20, 2024

యుక్తి తేది : 15-04-2023 శీర్షిక : చతురత

 యుక్తి 

తేది : 15-04-2023
శీర్షిక : చతురత 

కొన్నిసార్లు ఏనుగంత బలం కన్నా 
ఎలుకంత చతురత మేలంటారు .... 
ఉపాయమున్నోడు ఎప్పుడైనా 
ఊడిగం చేయడంటారు .... 

మనం గెలవాలనుకోవడం యుక్తి 
అవతలి వారు ఓడాలనుకోవడం 
కుయుక్తి .... 
ఆపదలో గట్టెక్కించేది బుద్ది. 
అనివార్యాలను నివారించేది యుక్తి  .... 

ప్రజా రంజక పాలనలకు యుక్తి 
పక్కవాడు చెడిపోవాలంటే కుయుక్తి ... 
ప్రస్తుతము  చలామణిలో ఉన్న 
భరత జాతి పాలనల రీతి ... నీతి .... 

యుగమేదైనా సరే  గగనమే .... 
గుంభనంగా గుర్తింపబడేది యుక్తి ... 
భోళాశంకరుని వరాలకు.... బోల్తా 
కొట్టేసిన ఇంద్రాదులకు .... భస్మాసుర 
హస్తమే ..... లాఘవమైన నటన విష్ణువుకు .... 

అడుగడుగునా  పాండవులకు ఎదురయ్యే 
ఆపదలకు ఆనకట్టలేస్తూ .... పాండవులను 
రక్షించింది .... పరంధాముడు శ్రీకృష్ణుడే .... 
పనిగట్టుకుని ప్రతిక్షణం  యుక్తితో ..... 

వ్యాపార ఒడిదుడుకులను వడిగా దాటుకుని 
విజయ తీరాలను ముద్దాడుతున్నారు .... 
అంబానీ ... టాటా ... బిర్లా... మహీంద్రాలు ... 
ఆకుచాటు పిందెలా చమత్కారాలు చేసి ... 
చేష్టలుడిగి  చేతులెత్తేసారు మరి కొందరు .... 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment