Monday, May 20, 2024

చిత్ర కవిత 13-05-23 శీర్షిక : ఓ మహాకావ్యం

 చిత్ర కవిత 

13-05-23
శీర్షిక :  ఓ మహాకావ్యం 


అమ్మంటే ఓ మహాకావ్యం 
అమ్మంటే గొప్ప ప్రబంధం 
అనుభవిస్తేనే గాని అంతు చిక్కదు 
అనుభవం లేకుండా రాస్తే పొసగదు... 

ప్రాణమైన పోసుకొని 
పసిగుడ్డును పదిలపరుచ 
పరుస్తుంది కడుపులోన
కడుమెత్తని పొత్తిళ్ళను  ... 

గట్టిగ లేచి కూర్చుండ
పట్టు  దొరకక పోయినా …
పొట్టచూసి మురుసుకుని 
పుట్టెడు దీవెనలిస్తుంది...   

ప్రపంచాన పరిచయించ 
పృథ్విపైన పదిలపరచ…
పక్కను కూడ దొర్లించలేక 
నిక్కబొడుచు రోమాలు...  

రుధిరం స్తన్యంచేసి 
మధురంగా నింపుతుంది ... 
రోజుల పాపాయిని తాను
రాజులాగా పెంచుతుంది....  

జ్ఞానమెరుగని జీవితాన 
జీవగడియారంగ మారిపోయి…
గడియకొక్కసారిగా
జవజీవాలకు మెతుకౌతుంది .. 

అమ్మెంత మంచిదో 
అమ్మెంత గొప్పదో 
మధురమైన తేనియలా
మమతలు నిండిన పొదరిల్లులా… 

No comments:

Post a Comment