నర్సులు
తేది : 12-05-2023
శీర్షిక : ధవళకాంతి దేవదూతలు.
పేరు గొప్ప ఊరు దిబ్బలా ...
సూపర్ స్పెషలిటీస్ ఎన్నున్నా
ఆఫర్ చేసే సహాయచర్యలు సున్నయితే
ఆ ఆసుపత్రి ఇక అధోగతే ....
మందులెంత ముఖ్యమో
మాట పలకరింపులు అంతే ....
అనారోగ్యాలకు ఔషదమెంతో
చిరుదరహాసాల సేవలంతే ....
అనారోగ్యం ఆవరించిన
కుటుంబాలలో యుద్ధమే ..
వాతావరణమంతా వైరుధ్యమే ...
శాంతికి పునాది వేసే సిస్టరమ్మ ....
కష్టాలెన్నున్నా కనపడనీయక
కంటి వెలుగులలో కాంతిపథం ...
రోగి భయాలను పారద్రోలే మనోధైర్యం ....
అనారోగ్యం అయిపోతుంది హుష్ కాకి ....
అంటురోగమైనా వంటి రోగమైనా సరే
ప్రాణాలు ఫణంగా పెట్టయినా
పాత్ర పోషించడమే విధానం ....
సేవలోనే సర్వదా నిమగ్నం ....
మానవత్వాన్ని నెత్తికెత్తుకుని
మనల్నికాపాడే పనిలో
పడ్డ ధన్వంతరి వారసులైన
ధవళకాంతి దేవదూతలు.
నీకొరకు నాకొరకు సదా
నిప్పుల కొలిమెక్కుతున్నారు ...
వారే నిజమైన దేవుండ్లు
నమ్ము సోదరా!
నగునూరి రాజన్న
No comments:
Post a Comment