Monday, May 20, 2024

బస్సు ప్రయాణం తేది : 12-05-2023. శీర్షిక : ఎంతచెట్టుకు అంత గాలి.

 బస్సు ప్రయాణం 

తేది : 12-05-2023. 
శీర్షిక : ఎంతచెట్టుకు అంత గాలి. 

కాలి నడకల కథలలో .... కాశీకి 
వెళ్ళినవారు కాటికి వెళ్లినవారితో 
సమానమే నంటూ సాగతీతలు .... 

పారిశ్రామికీకరణ అడుగులతో 
వడి పెరిగిన జీవితాలలో 
సుడిగాలిలా వచ్చేసింది రవాణా 
సాధనమంటూ ప్రజా రవాణా .... 

ఎంత చెట్టుకు అంత గాలిలా ... 
పేదవారి పెన్నిధి ఎర్ర బస్సు ... 
మధ్యతరగతి వారి మిద్దె జీవితం 
ఎక్స్ప్రెస్ ... సెమిలక్జెరీ .... 
డబ్బున్నోళ్ల ఠీవీ దర్పం 
హైటెక్కు లేదంటే  గరుడ .... 
స్లీపర్  కోచ్ లు ..... 

అవసరాన్ని బట్టి అందిపుచ్చుకోవడమే .... 
అర్ధరాత్రి అపర రాత్రి అడ్డంకులే లేవు .... 
మూడొందల అరవై అయిదు రోజులు .... 
ముప్పూటలా మురిపమై ఇరవై నాలుగుగంటలు .... 

రంజిల్లే రహదారులలో 
సమయం కుంచించుకు పోయి 
రయ్యి రయ్యిమని వేగం పెరిగగానే... 
పైన పటారంలా పటాటోపమే పయనంలో ... 

పండగలకు పబ్బాలకు మాత్రం . 
దండిగా వాయించి ... ప్రభుత్వమంటే 
ప్రజాసంక్షేమమన్న ఇంగితం మరిచి .... 
ప్రైవేటు పాఠం బుర్రకెక్కించుకుని ... 
రామ కీర్తనలు పాడిస్తున్నారు ప్రజల చేత... 
అధిక రేట్లతో .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment