Monday, May 20, 2024

కవన రవళి - నానీలు తేది: 11-05-2023.

 కవన రవళి - నానీలు

తేది: 11-05-2023. 
 

1. తరాలకైనా 
తరగని విజ్ఞానం . 
విశ్వమెప్పుడు 
వీడని చిక్కుముడే ... 

2. ముద్దబంతుల 
మురిపాల హారమే .... 
గ్రహకూటములు 
పాలపుంతలో .... 

3. ఆకాశమొక 
అందాల భరిణె ... 
రంగులెరుగని 
సప్తవర్ణం .... 

4. చీకటి రాత్రుల 
వెలుగుపూలు ... 
చిటారుకొమ్మల 
నక్షత్రాలు .... 

5. యుగాలెన్ని 
గడిచినా ... 
జగాన తేజమే 
రామరాజ్యం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment