Monday, May 20, 2024

చిత్ర కవిత తేది :08-05-2023 శీర్షిక : అవనిమాత సోదరుడు

 చిత్ర కవిత 

తేది :08-05-2023
శీర్షిక :  అవనిమాత సోదరుడు 
సంఖ్య: సహస్రాధికం. 

ఆకాశ రాజ నివాసంలో అందంగా 
ఒదిగిపోయిన సుందరాంగుడు.... 
అవని మాతకు వరుస సోదరుడై 
ఆరున్నొక్క రాగాల బాల్యానికి 
చూ... మంత్రం వేసే సూదంటురాయి ... 

ఆప్యాయతలు కుమ్మరించే 
అందరెరిగిన చల్లని  మూర్తి ... 
నిశిరాత్రులలో పండువెన్నెలలు 
కుమ్మరించి  మంచు కొండలను 
తలపించు మారాజు... 

కథలెన్నో పొదువుకుని అమ్మ 
నోట పలికించి అమృతాలను 
చిలకరించి ఆత్మీయతలు పంచి 
తీపి చెరుకుగడలనిచ్చి తీయని 
బాల్యానికి  తీరొక్క రీతిలో ఓదార్పే ... 

కృష్ణపక్షంలో కృశించినా 
శుక్లపక్షంలో  ఎదుగుతూ 
జీవన సత్యాలను బోధించే 
సద్గుణ సంపన్నాల గురువు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment