Monday, May 20, 2024

చిత్ర కవిత (మన్ కీ బాత్ 100 వ భాగం ) తేది :30-04-2023 శీర్షిక : శత వారం

 చిత్ర కవిత (మన్  కీ  బాత్  100  వ  భాగం ) 

తేది :30-04-2023
శీర్షిక : శత వారం 

ఎందరో మహానుభావులు 
అందరికి వందనాలు .... 
లోకో భిన్న రుచి .... అభిరుచి 
ఏదైనా మంచిదే ... మానవ 
శ్రేయస్సుకు పురోభివృద్ధికి 
అడుగేసేదై ఉండాలి .... 

స్వార్ధపు వాసనెరుగని సంతులు 
కోకొల్లలు మనదేశం నిండా .... 
అక్కడక్కడా పుణ్యాత్ములున్నారు 
కాబట్టే మానవాళి సుభిక్షంగా ఉంది .... 

ఒకరు  చెట్లు నాటితే ... మరొకరు 
నీటిని ఒడిసి పట్టారు .... ఒకరు 
పర్యావరణానికి  పెద్ద పీట  వేస్తే ... 
మరొకరు కాలుష్య రహిత ఉత్పత్తులకు 
తమవంతు బాధ్యతలు నిర్వర్తిస్తూ 
దేశం గర్వపడేలా అడుగులేసారు ,,,,

అసలు సిసలు దేశభక్తికి ఆనవాళ్లయిన  
స్వీయ క్రమశిక్షణాల సిపాయి 
మన ప్రియతమ ప్రధానిగారి 
నిష్ణాతత్వం ... విభిన్న ప్రాంతాలను 
వైవిధ్యభరిత పాత్రలను ఎన్నిక 
చేయడం ఎంతైనా ముదావహం ..... 

భాషలెన్నున్నా .... మాతృభాషలో 
వింటే ఆ మజానే వేరంటూ నానుడి .... 
అందుకు ఉద్యుక్తులైన వారు మన 
శ్రీ రాయవరపు ప్రకాష్ రావు గారికి 
మన తెలుగులో వినిపించినందుకు 
వారికివే ధన్యవాదాలు  ..... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment