సంతసాల సంగమం
తేది :09-05-2023
శీర్షిక : అన్నీ…
సంఖ్య: సహస్రాధికం.
తన్మయ దృశ్యాలను తపనలతో
బందిస్తూ... రెప్పలు మూయని కిటికీలు
బంగారు భావచిత్రాలను మనసు
తెరపైన కుంచెతో కుమ్మరించడమే ....
బుద్ది నేర్చిననుండి సద్దిముల్ లెలే నాకు ....
ఎప్పటి నుండి ఏరుకుంటున్నానో ...
కొన్ని చెరిగిపోనీవైతే ... మరికొన్ని మరిచినవి ....
మరకతమై శోభించే మహీతలంపైన.
పల్లెపట్టున పంట పొలాలలోనో …
పట్నములో పరిచయమక్కర లేని
బాటసారులతోనో ....పరిచయాల ఊసు లలోనో....
కుటుంబ సభ్యుల శ్వాసలలోనో....
చదువుల తోటలోనో ... ఉపాధి వేటలోనో ....
విరామమెరుగని వింత జీవన పయనంలో
జీవితంలో అడుగడుగునా తారసపడే
బంధు మిత్రుల సంగమంలో .....
మదిని గెలిచిన మంద్రహాసమో
సింగారించుకున్న చిరు దరహాసాల చిద్విలాసమో
ముసిముసిగా విచ్చుకునే ముచ్చట్లో
విరగబడి జారిపోయే విరజాజులో
పగలబడి నవ్వే పచ్చ పువ్వులో ....
ఏవైనా సరే మచ్చుకు ....కొన్ని....
అన్నీ సంతసాల సంగమమే .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment