Monday, May 20, 2024

మంటికీ మింటికీ మధ్యన తేది: 11-05-2023 శీర్షిక : తరంగ దైర్ఘ్యం - విజ్ఞాన భాండాగారం

 మంటికీ  మింటికీ  మధ్యన 

తేది: 11-05-2023 
శీర్షిక : తరంగ  దైర్ఘ్యం - విజ్ఞాన భాండాగారం 
సంఖ్య : సహస్రాధికం 

అందమైన స్వాతి ముత్యం 
ఆల్చిప్పలో అమురుకున్న సప్తవర్ణం… 
అనితరమైన మనోహర దృష్యం 
అనంతమైన ఈ విశ్వం..... 

మంటికీ  మింటికీ  మధ్యన 
శూన్యముతోబాటు బహు సుందరమూ ... 
కలిసిపోతున్నట్టు భ్రమింపజేసినా 
కలవని స్వీయ నియంత్రణల చిత్రమై
కలిసి బ్రతుకుతున్న గ్రహ కుటుంబమే .... 

తరంగాల దైర్ఘ్యములతో 
తనువంతా పులకరింపజేసుకుంటూ
జీవరాశికి జవజీవాలను ఇస్తూ 
సాంకేతికతల సౌరభాలను సైతం 
గుభాళింపజేస్తున్నది ... 

ముద్దబంతుల పాలపుంతలతో
మురిపమైన గ్రహ హారములుగా
ముచ్చటగొలుపుతున్నది శూన్యమంతా… 
సూర్య చంద్ర నక్షత్ర మండలాలతో…. 

ఒక్కొక్క పాలపుంత ఒక్కొక్క 
విజ్ఞాన భాండాగారం ... 
ఒడువని వింతల  ముచ్చటే ...... 
తరాలకైనా తరగని విజ్ఞాన వీచిక .... 
విసిరిందంటే మనిషి జీవితకాలమంతా 
వీడని చిక్కుముడే.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment