Tuesday, May 21, 2024

పచ్చని సిరి తేది : 0605-2023 శీర్షిక : మరకతమై శోభించు ....

 పచ్చని సిరి

తేది :  0605-2023
శీర్షిక : మరకతమై శోభించు .... 

నిండు కుండ బోనమోలే 
పండు వెన్నెల పౌర్ణమోలే 
పచ్చలు పొదుగుకున్న అవని మాత 
మరకతమై శోభించె పాలపుంతలో .... 

తొలకరి పలకరించగానే 
పచ్చదనాల దుప్పటి కప్పుకుంటే 
అమ్మ ప్రేమలా  మనసు ఊయలూగు 
నాన్న భరోసాలా వెన్ను తట్టు .... 

సూర్యరశ్మితో సూదంటురాయిగా 
పత్రహరితము జనితమై 
జీవరాశికి ఆలవాలమై
మానవాళికి వెన్నుదన్నైనది . 

రెండొంతుల నీటి లభ్యతలతో 
జగమంతా పచ్చదనంగా 
ఫరిఢవిల్లగా ... స్వార్ధపు సంచులు 
కట్టుకున్న మనిషి కబోదయ్యాడు .. 

పచ్చదనం ఫరిడవిల్లితేనే 
వర్షపు నీడల అడుగు జాడలు 
స్వచ్ఛత నిండిన ప్రాణవాయువులు 
చల్లని తల్లిగా దీవెనలందించు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment