నిశ్శబ్ద ప్రవాహం
తేది :06-06-2023
శీర్షిక : ఆలా కదిలిపోతూంటుంది ....
సహస్రాధికం
తిరిగి చూసినంతలోనే కనుమరుగాయే ....
కష్టాల కడలిలో ఈదిన సాహసమంతా
కరిగిపోయి కరిమింగిన వెలగపండయ్యింది ....
ముదిమి మీదికొచ్చి మురిపిస్తున్నది ....
ఎంతవారైనా సరేనంటూ
సవాలు విసిరి సై అంటుంది...
కాలం కుమ్మరించే కఠిన
అనుభవాలకు తలవంచమంటుంది ...
అనుభవాల అలమారాలు మోసి
అలసి డస్సిపోయిన శరీరం ....
అన్నింటా నేనున్నానంటూ
మేల్కొనే మానసానికి సర్ది చెబుతుంది ....
వెండి తీగల జలతారు వయసులో
ముదిమి వయసు మీదపడగానే
ముదిమి వయసు మీదపడగానే
వెన్నెముక జారిపోయి వంగిపోగా
వడి తగ్గిన అడుగులు వంత పాడుతాయి…
పైకప్పు కొక్కేనికి వేలాడదీసిన చూపులు
సరిగ్గా కనలేకపోయినా ...కర్ణ భేరీలు సన్నగిల్లి
వినలేకపోయినా... శక్తి సత్తువలు సన్నగిల్లి
పలకరింపులు లేక .... అలా కదిలిపోతూంటుంది
నిశ్శబ్ద ప్రవాహం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment