Tuesday, May 21, 2024

సులభ సాధ్యం - కష్టసాధ్యం - అసాధ్యం తేది : 06-06-23 శీర్షిక : అనుభవసారం

 సులభ సాధ్యం - కష్టసాధ్యం - అసాధ్యం 

తేది : 06-06-23
శీర్షిక : అనుభవసారం 

పంచతంత్రంలోన పర్యాప్తియే 
కదా..ముచ్చటగొల్పె సాధ్యముల 
మురిపమైన రీతిలో ... 
సూక్ష్మంలో మోక్షమై నిలిచి 
సుందరముగా బోధించే .... 
మూడు చేపల కథలోన ముదముగా 
విశదపరచంగా లోతైన విజ్ఞాన నీతి .....  

పరిస్థితులన్నీ  ఫరిడవిల్లంగా 
పటుతరమై తీసుకునే నిర్ణయం...  
ఫలితమీయు మన గమనము 
పలు విజయాలకు సంకేతమై .... 

చేజారి పోతుంటే...చెంగున దూకి 
కనువిప్పుగానైన  మనము కదిలినచో 
కష్టసాధ్యమైనను కొంత కలిసి వచ్చు 
అత్తెసరుగానైనా ఆదుకొని నిలుచు .... 

అలసత్వాల దత్త పుత్రులకు  
అందుకొనగా కాదె అసాధ్యం .... 
పొందైన విజయము పోటీలలోనా 
ధాటిగా నిలబడలేని దండగల మారులకు  .... 

సాధనమ్మున సమకూరునటంచు 
సంధించె నాడే పూర్వీకులు .... 
అనుభవాలనెప్పుడు అలసత్వం 
చేయక ఆచరించి చూడు .... 
అచ్చెరువొందే విజయములే ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment