వచన పద్య రచన
తేది : 06-06-2023
1.
అర్హతలకు మించిన అధికారం దొరక
ఆలోచనలు లేక అడుగులు వేసే....
అడ్డంగా దొరికిపోయి నడ్డి విరిగే ....
అనుకున్నదొక్కటి అయినదొక్కటి
హాయ్ రామా !
2.
అధికార దర్పములను వెలగబెట్టి
అపహాస్యము చేయనెంచిన సుయోధనుడు
ఆడలేక ఓడే గంధర్వులతోడ
అనుకున్నదొక్కటి అయినదొక్కటి
హాయ్ రామా !
3.
అయిదూళ్లయినా చాలన్న వర్తమానమునకు
పరాక్రములని తెలిసి పరిహసించిన పాపానికి ...
పంతమునకు పోయి పతనమాయిరి ...
అనుకున్నదొక్కటి అయినదొక్కటి
హాయ్ రామా !
4.
అద్దె ఇళ్ళని సద్ది ముల్లెయని సుద్దులేల
వద్దన్న పనులను వాలాయించి చేయ ....
అక్కెరకు మించి మాట్లాడిన చిక్కులాయె....
అనుకున్నదొక్కటి అయినదొక్కటి
హాయ్ రామా !
5.
ముందువెనకలు చూడక వందమాటలేల?
పొందుగ ఫలితమందగనే మాట మార్చుడేల?
జనమంత ఛీకొట్టి ఛీత్కరించగ దులుపుకోవడమాయె
అనుకున్నదొక్కటి అయినదొక్కటి హాయ్ రామా !
నగునూరి రాజన్న
No comments:
Post a Comment