చిత్ర గజల్
06-04-2023
6/6/6/6
కోటలోని చిన్నదాన
పాడెదమా చిందులేసి
కోరి నన్ను వలచితివా
ఆడెదమా చిందులేసి
సెలయేటీ నీటిలోనే
చిత్రంగా గంతులేసి
రోజంతా గడుపుతునే
తడిసెదమా చిందులేసి
చందమామ వెన్నెలలో
ప్రేమలన్ని ముల్లెకట్టి
జ్ఞాపకాల దొంతరలూ
తలిచెదమా చిందులేసి
ఇరువురమూ ఒక్కటయ్యి
వీడిపోని బంధమనీ
లోకాలకు చాటుతూనె
మురిసెదమా చిందులేసి
రాజసమే జీవితమని
రమణీయం మనదనీను
లోకానికి వెరవకుండ
మరిచెదమా చిందులేసి
నగునూరి రాజన్న
No comments:
Post a Comment