చిత్ర కవిత
తేది : 05-06-2023
శీర్షిక : పంట కష్టం - వంట కష్టం
మంటిని స్వేదంతో కలిపి
ఒంటికి బురద పూసుకొని
ఆరుగాలం అవస్థలు పడితే గాని
అంకురం వరికంకులేసేది .....
ఆత్మీయతలు పంచుకునే
అయినవాళ్ళకన్నా ... తోక చుట్టం
పట్టుకున్న తొంబై మంది అతిథులు
వందిమాగదులు నేటి ఉత్సవాలలో ....
ఆడంబరాల ప్రతాపమంతా
అన్న ప్రసాదం మీదనే ....
అక్కరకు మించిన లెక్కలేనన్ని
రకాలతో ఊదరగొట్టే అతిథేయులు ....
కుప్పమీదొచ్చే తెప్పలాటలా
నా కష్టం కాదు ...నా స్వంతం కాదు ....
ఎవరెక్కడ పోతే నాకేంటనే అతిథులు
ప్రణాళిక లేని నిర్లక్ష్యం ...నిర్లిప్తత ...
స్వార్థం నిండిన మాయా మొహం ...
సర్వం ఆశించే జిహ్వచాపల్యం ....
ఆత్మసాక్షి ప్రబోధాన్ని ఆవలకు నెట్టి
అహం బ్రహ్మాస్మి అనే అర్థ విజ్ఞత ....
ఒకపక్క అర్థాకలి ఆర్తనాదాలు
మరోపక్క స్వీయ క్రమశిక్షణ లేని
మిడిమిడి జ్ఞానాల మిడతలదండు
పట్టింపులు లేని పాలనావిధానాలు ....
వంట కష్టం తెలిసినా
పంట కష్టం తెలియకుండానే
పెరుగుతున్న పట్టనీకరణలతో...
విలువ లేని వలువలలా తయారయింది ....
ప్రతి మనిషి పాలు పంచుకోవాలి
పంటవిధానాల పనితనములో ...
దేశ రక్షణవిధానాల కష్ట సుఖాలు ....
స్వీయ నియంత్రణలు చిగురింప ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment