Tuesday, May 21, 2024

సమాజమా నీ దారెటు ? తేది : 02-06-2023 శీర్షిక : మొక్కగానే .....

 సమాజమా నీ దారెటు ?

తేది : 02-06-2023
శీర్షిక : మొక్కగానే ..... 

కలికాలం యుగధర్మమో 
కాని కాలమని సరిపెట్టుకోవాలో ... 
పారిశ్రామికీకరణ పరుగులతో 
అంతంత మాత్రంగా ఉన్న అనుబంధాలు .... 

సాంకేతికత సంధి కొట్టాక 
పరతమ భేదము లేకుండా 
స్వంతవారిని పట్టించుకున్న 
దాఖలాలు కూడా కరువయ్యాయి ... 

పట్టణీకరణలతోనే పలుచబడిన 
బంధుత్వాలు ....సాంకేతికతల 
పిడికిట విశ్వం బిగించుకుని 
పాశ్చాత్య సంస్కృతికి బానిసలై .... 

పూలను మాలగా చూపే 
కనపడని దారం కాస్తా మాయమైనట్టు  
వంటిల్లు  చిరునామా మారిపోయి 
ఆత్మీయతలు అటకెక్కుతున్నాయి .... 

చాపకింద నీరులా ఒకరు
 కరటక దమనక నీతులోవైపు 
నిఖార్సైన నీతి నిజాయితీ 
దుర్భిణి వేసుకున్న అగమ్యగోచరమే ... 

జగమంతా వసుధైక కుటుంబంలా 
ఉండాల్సింది ... కత్తులు నూరుకుంటుంటే 
కలపాల్సిన వాళ్ళు కాస్తా .... ఆయుధాల 
బేరాలతో లాభాలు బేరీజు వేసుకుని 
మనీతత్వం కాస్తా మానవత్వాన్ని 
ముసుగేసి కాలరాస్తున్నది ..... 

పరంధాముడే పదకొండవ 
అవతారం ఎత్తి... పరీక్ష కాలాన్ని 
పక్వము చెందించి...ఫలదీకరణ 
గావించి ... మేలైన విత్తనం వెదికి 
అంకురింపజేయాలి ..... 

మొక్కగా  ఉన్నప్పుడే  సుందర 
చైతన్యానందం అంటుకట్టి .... 
ఆయుశ్హు పోసి .... అకుంఠిత 
దీక్షలతో దక్షున్ని చేయాలి .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment