Monday, May 20, 2024

బాబు జగజీవన్ రామ్ తేది : 05-04-2023 శీర్షిక : తగిన గుర్తింపు దక్కని మణిరత్నం ...

 బాబు జగజీవన్ రామ్ 

తేది : 05-04-2023
శీర్షిక : తగిన గుర్తింపు దక్కని మణిరత్నం ... 

బీహారులో పుట్టి జోహారులందుకున్న 
స్వాతంత్య్ర సమరయోధుడు 
అనంతర కాలపు అమాత్యుడు 
అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి ... 

కులవివక్షలను కూకటి వేళ్ళతో 
కదిలించాలని సతతం హక్కులకై 
సమరం చేసాడు ... సుదీర్ఘకాలం 
లోకసభ సభ్యడై నిలిచాడు ... 

నిరంతర ప్రతినిధిగా 
ఖండాంతర ఖ్యాతి పొంది 
విశ్వ  చరిత్రలో వినూతన 
అధ్యాయం  సృష్టించాడు .  

కార్మిక సంక్షేమాలకు కారకుడై ... 
హరిత విప్లవానికి  సారధుడై ... 
బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకుడైనా  .... 
చాన్నాళ్లు కాంగ్రెసుకు విధేయుడే. 

ఉపప్రధానిగా ఉన్నతి పొందినా 
తగిన గుర్తింపు దక్కని మణిరత్నం .... 
తదనంతరం వేరు పార్టీలతో 
తనదైన శైలిలో ముందుకు సాగాడు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment