Monday, May 20, 2024

భవానీ సాహిత్య వేదిక తేది : 04-04-2023 శీర్షిక : మరో జన్మ

 భవానీ సాహిత్య వేదిక 

తేది : 04-04-2023
శీర్షిక : మరో జన్మ 

మనో కేంద్రములోని మతలబులకో  .... 
గుండె గూటిలోని గుసగుసలకో  .... 
నిండుగా కదలాడి పండు వెన్నెలలను 
కురిపిస్తూ ....  పదనిసలు జోడిస్తూ .... 
పలకరింపుల పనిని సైతం చేస్తుంటాయి… 

ఆనందాలకు....  మెరుపులు కురిపిస్తూ 
బాధలకు ...ఖిన్నులై ....  దుఃఖాలకు ....మత్తల్లై ....
భావోద్వేగాలకు .... అగ్నికణములై .... 
నవరసాలలో  తలమునకలౌతుంటాయి ...... 

చూపులు కలిసిన శుభవేళా ...అంటూ 
కనుదోయి ....సవ్యంగా పని చేసినంత సేపు 
పట్టదు ఎవరికి దాని విలువ ప్రాముఖ్యత ...... 

పుట్టుకతోనో  ....సంధి కొట్టిన 
కారణాలతోనో  ...అంధకారం కనుక ఆవహిస్తే.... 
సుందరమైన మనిషి జీవితంలో ....  కకావికలమే…

అంధకారాలకు సుందరచైతన్యమైన 
కటకముల  మార్పిడి కంటి చికిత్సలు 
వెలుగులు నింపే దివ్య జ్యోతులు ... 

దేవుడు గీతలో  ప్రవచించినట్టుగా   
జీవుడు దేహం మార్చుకున్నట్టు.... 
అవయవ దానాలపై అవగాహనలు పెంచాలి 
ఆలోచనలు మార్చాలి ప్రజలలో .... 

అపార విలువలు కలిగిన 
నయన కవాటాల  దానంతో 
అందిపుచ్చుకోవచ్చు అనితరమై 
నిండిన  మానవతలతో  మరో జన్మ ….

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment