ఇది మల్లెల వేళయనీ ....
తేది :03-05-2023
శీర్షిక : తీయని అనుబంధాల సవ్వడి
సంఖ్య : సహస్రాధికం
ఊహలన్నీ మోసుకుంటూ
ఊసులన్నీ మూటకట్టుకుని
ఉడికించే యవ్వనాలలో
పరిమళించే మనసు మనోహరం ....
మాటలలోనో మననంలోనో
భావనలోనో బ్రతుకుబాటలలోనో
ప్రతివారికి సుపరిచితమే
పరమ సుందరమైన పదబంధముగా ....
పల్లవిగా ఎత్తుకుని పాటగా
మలుచుకుంటే... సెలయేటి
గలగలలే ...కొండా కోనలలో
అల్లన తిరిగే సిత్రమైన పక్షుల
పలుకుల కువకువలే... పలికించగా....
ఆనందాలకు చిరునామాగా
అలకలకు చిరు కానుకగా
సురుచిర మృష్టాన్నమే
ప్రేయసీ ప్రియుల అవ్యక్తాలకు .....
మరో లోకమై వర్దిల్లదా ...
మనసు పల్లవించే వేళలలో
మమతా కాంతులు ప్రసరించే గాలులలో
తీయని అనుబంధపు సవ్వడిగా ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment