మనసే కోవెలగా ...
తేది :02-05-2023
శిర్షిక : మమతల దివిటీ
సంఖ్య : సహస్రాధికం ....
నిస్స్వార్థాలను నిలువెత్తుగా
అక్కున చేర్చుకుని
నిరంతర జప తపాలతో
ప్రేమ వెలుగులు నింపుకుంటేనే
పెను కాంతి వలయం ఆవరిస్తుంది ....
ఆత్మీయ లతలు అల్లుకుని
మమతల తీగలు పారిస్తేనే....
మనసు కోవెలగా మారిపోయి
జ్యోతి ప్రకాశాలను ప్రజ్వరిల్లజేస్తుం ది ....
ప్రతిపనిలో పరంధామున్ని
ప్రకటించుకుని.... తన్మయత్వంలో
తలమునకలై తపో నిష్ఠలను
తలపింపచేసుకుంటే ....తప్పక మనసు
కోవెల చిరునామై చిద్విలాసమౌతుం ది ....
ఈర్ష్యా ద్వేషాల గోడలను ఈడ్చి
బద్దలు కొట్టి... సమతా మమతల
సంస్కారాలను మూటగట్టుకుంటే ....
సాటివారికి ప్రేమలు పంచగలిగితే ....
సాధ్యమే మనసు కోవెలయి మమతల
దివిటీగా వెలుగులు ప్రసరించగలగడం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment