యుక్తా యుక్త విచక్షణ
తేది : 02-06-2023
శీర్షిక : తపోధనులు కావాలి
పుట్లకొద్దీ జనాలు కోట్లకొద్దీ పన్నులు
జమచేసినా...తూట్లు పడిపోయిన ఖజానాల
సంచిలో మిగులుబాటు గోచరించక
తరుగుబాటులతోనే సర్దుకుంటున్నాయి ....
వేదికలమీద ఉపన్యాస ప్రవచనాల
ప్రణాళికల పంచాంగం అంతా
బడుగుల బలహీనుల రాశులను విస్మరించి...
పర్వదినపు పంచాంగ శ్రవణం
తూ తూ మంత్రంగా సంపూర్ణమంటున్నయి...
ఢంకాలు బజాయించుకునే
అభివృద్ధి తరువులమ్మ కాలేక ఎందుకో
కినుక వహించి ....పల్లె రైతుల కడగండ్లకు
కండువా కాలేక పోతున్నది ... మురికివాడల
కూడా చేరలేక వాసనలకు ముక్కు పుటాలు
అదిరిపోయి మూసుకుంటున్నాయి ..
అభివృద్ధి ఫలాలన్నీ ఆఖరు మనిషికి
అందని ద్రాక్షలైపోతూ బహుశా రాజధాని
చుట్టూరా ఓ ఆర్ ఆర్ పహారాలో పరాధీనమై
బందీగా మారి విచార వదనంతో ఖిన్నురాలై
నిస్తేజంగా వీక్షిస్తున్నదేమో ....
అధికారపక్షమో ... ప్రతిపక్షమో తపోధనులై
పూనుకుని .... వేచి నిలిచిన ధాన్యపు ట్రాక్టర్ల
యతలు...కథలు... తీర్చి సమయంలోపల
ధాన్యం ధాన్యాగారానికి చేర్చి కథకు త్వర శుభం
ముగింపు అవుతే ఎంత బాగుండు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment