Sunday, July 25, 2021

చెఱుకు తీపి చెక్క బండి పయనం picture for hykoos 11.

 

చెఱుకు తీపి 

చెక్క బండి పయనం
చాంగు భళారే...✍️

పల్లె వినోదం 
వెల్లి విరిసె నేడు
కనుమ తోడ....✍️

పాడి పంటలు 
పరిమళించు వేళ 
పర్వం కనుమ....✍️

పసిడి నవ్వు
పాపాయిల సొంతం
పండుగ రోజు....✍️

కనుమ వచ్చి
కనువిందాయె కద
పిల్లా పెద్దలు....✍️

ముస్తాబయ్యిరి
మురిపములు పంచ
ముద్దు బాలలు....✍️

కెవ్వు కేరింత
జోడెద్దుల సవారి 
కనుమ శోభ...✍️

మురిపమాయె
మానవాళి పర్వాన
మూగజీవాలు...✍️

పిల్లా పాపల
కేరింతల తుళ్ళింత
పండగ శోభ...✍️

కమనీయపు
అలంకారం కాడెడ్లు
కనుమ రోజు .... ✍️

జోడెడ్ల దమ్ము 
లేపింది చూడు దుమ్ము
కేరింత నమ్ము....✍️

అందం చిందె
అలనాటి బండెడ్లు
అలంకృతంన.....✍️

No comments:

Post a Comment