కళ్ళల్లో కన్నీరు
కవిత సంఖ్య : 84
తేది : 14-02-2021
నలుపు తెలుపుల సంగమమే
దృష్యమానమైనా.....
సుందరమైన మల్లెలాంటి తెల్లని
ఎద ఫలకంపై నల్లని సిరాచుక్కల
చిలుకరింపులయితేనో.....
కుసుమాల జతన కొన్ని కంటకాలు
ఎంత తోబుట్టువులైనా....
కుసుమ కోమలమైన తెల్లని ఎద
కాన్వాసు పైన కంటకపు కాటు పడితేనో .....
కఠిన శిలలు.. జలనిధులెంత
కవలలైనా ..... మృదులాస్థి
ముద్దు సంతతి గంభీర వదన
ఎద సంద్రములో.... విసిరిన
చిల్ల పెంకులవల్లనో..........
ఎద సంద్రంలో పొగిలే సునామీల
మూలములో......
మది గదిలో గడ్డ కట్టి కుంచించుక
పోయిన బాధలో....
గొంతు దాటని గోప్యతల విస్పోటనలో......
తడిసిన ఎద కాగితంపైన
విడిసిన భావ కుబుసాలు
కవాతు చేస్తుంటే....కంటనీరై
ఎదను కడిగిన ముత్యం చేస్తుంది....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment