సరిగమల సవ్వడి
తేదీ: 14-03-2021
కవిత సంఖ్య : 95
సరిగమపదనిస లనే
సప్తస్వరాలను క్లుప్తపరిచి
వివిధ స్వరాల సంగమాలతో
నియమ స్వరాల మేళవింపులతో...
రక రకాల రాగాలను రంజింప
చేయడమే .....
అవసరాలనుకూలంగా
ఆరోహణలో .... అవరోహణలో....
ఇరువది రెండు ఇంపైన
సంగీత శ్రుతుల జతల చేసి
గతులను గాంధర్వ పరచడమే ....
సవ్వడి....
తీసే రాగము... వేసే తాళము....
కలిపే పదబంధాల
కలబోత లయల ఇంపుగ
చేసే అక్షర విన్యాసం ......
సాంప్రదాయకమో ...ఆధునికమో.....
వాగ్గేయమో.... విద్వాంసమో .....
భారతీయమో.... కర్ణాటకమో.....
రకమేదైనా .... రంజింపజేసేదే సుమా
సరిగమపదనిస ల సవ్వడి......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment