ఆమె ఓ నది
తేది:20-04-2021
శీర్షిక: మహోన్నత మాతృమూర్తి ....
కవిత సంఖ్య: 644
అవును! ఆమె ఓ మహా నది
చీకటి వెలుగుల బాటలు
దాటే సమయ సూచీ ...
కష్ట సుఖాల కాలం ఈదే
పూలవనాల జాడలు ....
అందరి కళ్ళల్లో మెరుపులకు
తాను ఆనందాలు చిందిస్తూ
అందరి ముఖాల్లోచిరునవ్వులకు
కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయే అమ్మ !
పది మందినైనా పదిలంగా
కడుపులో పెట్టుకుని సాకి
అవసాన దశలో పట్టెడన్నం
పెట్టని వారిని కూడా దీవించే దేవత ....
పొలం పనుల్లో ప్రకృతి మాతగా
భావి పౌరుల భారతమాతగా
కార్మాగారములోన దుర్గమాతగా
రాకెట్టు లోన యక్షిణిలా రాణించగల
సత్తా ఉన్న సర్వాంతర్యామి ....
అన్నీ అలవోకగా సాధించినా
సవ్యసాచిలా సవరించగలిగినా
అధికారికంగా అర్ధభాగం మాత్రం
సాధించుకోలేక సతమతమౌతున్న
సౌమ్యమూర్తి ...
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment