రాజ్యాంగ నిర్మాత
తేది 14-04-2021
శీర్షిక : భారత రత్న
సంఖ్య - 009
భాగ్యశాలి భీమాబాయి రాంజీల
పదునాల్గవ సంతానమై....
పై చదువుల మమకారంతో
పట్టుదల క్రమశిక్షణలనక్కున చేర్చుకుని
కఠిన శ్రమలకోర్చి పట్టాలు దండిగా
పొందిన సరస్వతీ పుత్రుడు ....
బతుకు చీకట్లను బలంగా ఎదుర్కొన
అణగారిన జీవిత మూలాలనే
ఆయుధంగా మలుచుకుని
అత్యున్నత శిఖరం..”భారతరత్న”
అధిరోహించిన అపర మేధావి....
కులమతాల కుత్సితాలు...
వర్గ పోరాటాల..సమయాలలో
సైతం...బరోడా పెద్దల ప్రాపకం
సంపాదించగలిగిన కుశాగ్రబుద్ధిశా లి.
సంయమనం చంకనేసుకుని
సరైన సమయములో స్పందించి
పూనే సంధి కుదుర్చుకుని సాకారపర్చె...
బహు జనుల హక్కు భుక్తములు
బలముగ రాజ్యాంగానా...దినరరుడై...
పేరుకు ఏడుగురు సభ్యులున్నా
పెద్దన్న పాత్ర పోషించె చూడు
లిఖిత రాజ్యాంగ నిర్మాణమున
పెన్నిదై నిలువ భారతావనికి....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment