దురదృష్టం
తేది : 20-02-2021
కవిత సంఖ్య : 86
ప్రాణులన్నింటిలోన మిన్నంటూ
వివేక విచక్షణలన్నీ మా సొంతమంటూ
బాకాలూదుకుంటే .....
బతుకు భారమైన వాళ్ళ మాటేమిటి..?
రెక్కలు ముక్కలు చేసుకున్నా
గుప్పెడు మెతుకులు గొంతులో
వేసుకోలేని .... చేతకాని తనం ......
ఏమని నిర్వచించుకోవాలి ......
పట్టు పీతాంబరాలు కాకపోయినా
మానం కాపాడుకుని.... పాణం
నిలబెట్టుకొను .... ఆకలి తీర్చే....
అవసరాలు తీర్చుకోలేక పోవడమేమిటి ...?
ఇంద్రభవనాలు కాకపోయినా....
నిలువ నీడలు లేని అనాగరికతకు
అసలు కారణాలు ఏమై ఉంటాయి ?
అన్నీ ప్రశ్నలే .... అడుగడుగున
అడ్డంకులే......
రామబాణంలాంటి ఒక్కటే జవాబు.....
నిరక్షరాస్యత.... నిరుద్యోగ..... పోరుతో
పొదుపు లేని పొందికలతో..... పెట్టుబడులే
పెట్టకుండా ...... రాబడి కోరుకోవడమంటే....?
సరైన సమయములో.....
సరైన మార్గములో .......
సరైన పద్దతిగా .........
ప్రయత్నాలు చేయకపోవడం......
వాళ్ళ రైలు జీవిత కాలం లేటు......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment