పరిపూర్ణత్వం. 85
తేది:18-02-2021
ప్రత్యేక గుర్తింపు.....
అవధులు నిర్వచించ లేని
అనంత పయనం .....
ఎక్కడికక్కడే ఎరుకపరుచుకునే
ప్రత్యేక గుర్తింపు.....
ఆవేశాలను ఆవలకు నెట్టి
అవగాహనల సంకనేసుకుని
అనుభవాలను ప్రోది చేసుకుంటూ
అల్లుకు పోయినప్పుడే పరిపూర్ణత్వం
సంతరించుకునేది.....
ఓర్పు అణకువలకు ప్రేరణలై
కృషి పట్టుదలలకు చిరునామలై
ఆకళింపులకు పెద్ద పీట వేయగలిగితే
అంతు చిక్కే ఆనవాలు......
సంవత్సరాల తరబడి
పాఠాలు వినుకుంటూ...
సందర్భం వచ్చినపుడు
పరీక్షలు వ్రాయకుండ
కాలయాపనలు చేస్తే....
గుర్తింపులు దక్కనట్టే....
ఎంత మంచి నైపుణ్యమైనా
ఎక్కడికక్కడ గుర్తింపులతో
ఎంపిక చేసుకున్న శిఖరం
చేరితేనే ప్రత్యేక గుర్తింపు....
నగునూరి రాజన్న
కరినగరము .
No comments:
Post a Comment