స్వేచ్చా కవిత
కవిత సంఖ్య : 89
తేది : 26-02-2021
సప్తవర్ణముల శోభించు
ఇంద్రధనుస్సులా....
శట్రుతువులు కలిసి
శంక తీర్చు ....ప్రకృతి కాంత
పరి తపన ప్రాణుల అవసరాల......
మావి చిగుళ్లు తిని మత్తు గొన్న
కోకిలలు కుహు కుహు అంటూ
ముతైదువల గొంతు బోలిన
ముద్దు గొలుపు రాగాలాపన చేయు
వసంతపు వేకువనే ....
సంధికాలం సల్లంగ జారి
మెల్ల మెల్లంగ పుంజుకుని
దినకరుడు .... దిక్కులు
పిక్కటిల్ల జేయు తన ప్రతాపంతో
గ్రీష్మాన.....
సంద్రమున తస్కరించిన తడితో
తపనపడి కురిపించు మేఘుడు
ధరణీతలమున... తెప్పరిల్ల
ఎండవేడిల నుండి .... కలవరించే
చల్లదనములకై ..... చేరు చినుకై
వర్ష ఋతువున ........
విరబూసిన వెన్నెల్లో విశ్రమించి
తాతయ్య కథలతో తమకమై
తనువు పులకరించు వేళ ....
తానె వచ్చు కద శరదృతువై .....
చెట్టు చేమల మరకతములన్నీ
గుట్టలై నిండు మంచు ముత్యాల
రాశులతో.... దండి హేమంతమున......
ప్రకృతి మాత పండుటాకులను
రాల్చి కోటి ఆశల
కొత్త
ఊపిరులతో
వేచి నిలిచే కాలమే శిశిరం.......
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment