Saturday, July 31, 2021

కదిలే ఊహలకే కన్నులుంటే .... తేది: 26-02-2021

 కదిలే ఊహలకే కన్నులుంటే ....  

తేది: 26-02-2021
శీర్షిక: సమయ యంత్ర సారధినౌతా.... 
కవిత సంఖ్య: 616

గుప్పెడంత గుండెల్లో 
గూడు కట్టుకున్న ఆలోచనల్లో 
గువ్వలా  విహరిస్తూ .... 
మనోఫలకంపై కదులుతున్న 
ఊహలకే కన్నులుంటే......... 

సమయ యంత్ర సారథినై 
అరవిరిసిన తేనెల మాధుర్యాలొలికిన .. 
అస్తమించిన అమ్మానాన్నల 
అలనలను తిరిగి అనుభవిస్తా.... 

భక్తి తొడ బ్రహ్మను వేడుకుని 
బ్రహ్మ సమమైన బాల్యాన్ని ..... 
బాల్యపు బంగారు మధురిమలను 
బలవంతంగానైనా లాక్కుంటాను.... 

సుస్వరాన  హంసవాహనున్ని
వేడుకుని సాటి మనిషిని చల్లగ 
చూసే సత్యయుగానికి దీటైన 
సవ్య యుగంలోకి సాదరముగ
అడుగులేస్తా..... 

విరించిని వినమ్రంగా వేడుకుని 
విశ్వంతరాలలో నిక్షిప్తమైన 
విభిన్న వింతల కొలువులో  
విశిష్ట అతిథినై  విరాజిల్లుతా...... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment