సహనం
తేదీ: 17-02-2021
సంఖ్య -84
శీర్షిక : కొంతే హద్దుంటుంది....
ఎంతటి ఓర్పుకైనా... ఎంతో కొంతే
హద్దుంటుంది సుమా !
వ్యక్తుల స్వార్థాలో.......
ప్రభుత్వాల పనితనమో.....
భూమాత మనకు .....
ఖరీదుకట్టే షరాబు లేని
గల గల పారే సెలయేళ్ళు
మిస మిస లాడే పచ్చికబయళ్ళు
ఝుమ్మని వీచే గాలి తెమ్మెరలను
హోరుగా శబ్దించే సాగర అలలను
ఎన్నెన్ని సమకూర్చినా ......
పచ్చని అరణ్యాలను కరగదీస్తూ
వెచ్చని వాతావరణానికి ఆజ్యం
పోస్తూ ....
కలుషితాలన్నీ కలగలిపి
భూగోళాన్ని అగ్నిగోళంగా
మార్చేస్తున్నారు.....
క్రమశిక్షణలు కమ్మేసి
అధికారాలను అడ్డమేసి
అక్రమాల ఆలంభనగా
అడ్డదిడ్డంగా తవ్వేసి భూమిలో
ఖనిజాలని, ఇంధనాలని , గాసుని
డొల్ల చేసి గుల్లబార్చుతున్నారు ......
ఓర్చి ..... ఓర్చి.... భూమాత
సహనం వీడిన ఘీంకారాలతో
కళ్ళముందు కదిలిపోతున్న
ఉల్కల్లా .... శకలాలై పోతోందేమో......
కనికరమే లేకుండా....
కనపడ్డ కసాబులన్నీ
కాల సముద్రములో
కలిపేస్తుంటే.......
కస్సు బస్సులు చూపించి
అప్పుడప్పుడు తుఫానులై
కాదంటే సునామీలై ......
భూనబోంతరాలను కలిపేస్తుందేమో.....
ఎవరో వస్తారని
ఎదో చేస్తారని కాకుండా....
ప్రతి వారు ప్రాణామోలే
సంరక్షిస్తేనే......
మానవాళికి మనుగడ....
ప్రాణులన్నీటికి పండగ.....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment