మట్టి తోనూ మాట్లాడుదాం
తేదీ :02-03-2021
శీర్షిక:: మనువున్నంతవరకు ....
కవిత సంఖ్య : 619
అప్పడు ఇప్పుడు ఎప్పుడూ...
తప్పటడుగుల కుప్పకూలుతూ
ఉన్నప్పటినుండి అమ్మలా
అక్కున చేర్చుకుని సేద తీరుతూ ....
పలు భాషలలో పలు భావాల్లో
మనకు తెలియకుండానే మనం
మట్టితో మాట్లాడుతూనే ఉన్నాము
మమేకమవుతూనే ఉన్నాము.....
అల్లంత దూరాన ఆకాశాన
కనిపించే ఇంద్రధనుస్సులోన
ఇమిడిన రంగులన్నీ మనకు
ఆకుల్లో పూలల్లో పండ్లలో
వండి వార్చి వడ్డిస్తూంది అమ్మలా ....
రంగు రుచి వాసనల సమ్మేళనం
త్రీ రొసెస్ లా పరుచుకుని జివ్హ చాపల్యాన్ని
సంతృప్తి పరిచే రుచులనెన్నింటినో
అందిస్తుంది దివ్య ఔషధ మూలికల్లా......
మరకతమైన మట్టి గోళము
మనకెప్పుడూ మహా గ్రంథమే....
ఘనమైన రాసులనెన్నో పొదువుకుని
చరిత్రలను ముందు పరుస్తుంది.....
మన శ్వాసలతోనే గుస గుసలు
మట్టితో మాట్లాడుతున్నట్టు....
మనువున్నంత వరకు మనిషి
మట్టితో సంభాషిస్తూనే ఉంటాడు ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment