Friday, July 30, 2021

ప్రేమ గీతం తేదీ: 13-02-2021

 ప్రేమ గీతం 

తేదీ: 13-02-2021
కవిత సంఖ్య : 609
శీర్షిక : మాధుర్యం .... 

తొలి చూపుల మాధుర్యం 
మరువలేని మధురబంధం  
చెలి వలపుల తీయదనం 
శశి వెన్నెల చల్లదనం .... 

చూపులు విసిరిన మూగ భాషలు
సూదంటు రాయి సుమా... 
రువ్వుకున్న చిరు చిరునవ్వులు   
వింత అనుభవాలాయె  // తొలి //

మాటలకందని భావాలు 
మరులు గొలిపి జత కలిపేను ... 
కరిగిన కాల చక్రములో మిగిలే
గిలిగింతల మానసికోల్లాసం .... // తొలి // 

మదిలో నాటిన సంగతులు 
నిత్య నూతన పరిమళాలు 
మల్లె తీగలా నన్నల్లుకున్న 
ప్రేమ జీవన  సౌరభాలు .... // తొలి //

 నగునూరి రాజన్న 
కరీంనగర్

No comments:

Post a Comment